రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారి ఆలయం వేకువ జామునుంటే భక్తులతో కిటికిటలాడుతోంది. అర్చకులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం దర్శనానికి అనుమతిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు ధర్మగుండంలో పుణ్య స్నానాలాచరించి స్వామి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఆలయ అధికారులు రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలు రద్దు చేసి... లఘు దర్శనం అమలు చేశారు.
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ - వేములవాడ రాజన్న ఆలయం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే స్వామి దర్శనానికి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. రద్దీ దృష్ట్యా అధికారులు ఆర్జిత సేవలు రద్దు చేశారు.
భక్తుల రద్దీ