ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం సందర్భంగా కోడె మొక్కులు చెల్లించుకునేందుకు బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
రాజరాజేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు - వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. భక్తులు కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు.
రాజరాజేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు
సుమారు 50 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.