మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం సందర్భంగా ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకునేందుకు బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సుమారు 60 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
వేములవాడ ఆలయానికి పోటెత్తిన భక్తులు - telangana news
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకునేందుకు బారులు తీరారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
వేములవాడ ఆలయానికి పోటెత్తిన భక్తులు