రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఆదివారం కురిసిన భారీ వర్షానికి సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్, సంజీవయ్య నగర్ కమాన్ ప్రధాన రహదారి మురికి నీటితో నిండిపోయింది. వరద నీరు రోడ్లపై ఉద్ధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
RAINS: సిరిసిల్లలో భారీ వర్షం... రోడ్లన్నీ జలమయం - telangana varthalu
భారీ వర్షానికి సిరిసిల్ల పట్టణం తడిసిముద్దయింది. పాత బస్టాండ్, సంజీవయ్య నగర్ కమాన్ ప్రధాన రహదారి మురికి నీటితో నిండిపోయింది. సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో వరద నీరు రోడ్లపైకి చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ సండ్ర వాగు ప్రాజెక్టు నిండి అలుగు పారుతోంది.
![RAINS: సిరిసిల్లలో భారీ వర్షం... రోడ్లన్నీ జలమయం RAINS: సిరిసిల్లలో భారీ వర్షం... జలమయమైన రోడ్లు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12426753-587-12426753-1626014666353.jpg)
నాలుగు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో మురికి కాలువలు నిండి వరద నీరంతా రోడ్లపైకి చేరింది. సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఇటీవలే 50 లక్షలతో మురికి కాలువల మరమ్మతులు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామ శివారులోని సండ్ర వాగు ప్రాజెక్టు నిండి అలుగు దూకడంతో తంగళ్లపల్లి-లక్ష్మీపూర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ఇదీ చదవండి: Rains in Telangana: రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వానలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు