రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయినగర్‌కు చెందిన బూర రాజేశ్వరి పుట్టుకతోనే దివ్యాంగురాలు. ఇంటర్మీడియట్ చదివిన రాజేశ్వరి.. ఓ టీవీ ప్రోగ్రాంలో ప్రముఖ కవి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ మాటలు విని, ఆ ప్రభావంతో కాళ్లతోనే కవితలు రాయడం ప్రారంభించారు.
కాళ్లతోనే కవితలల్లి... మహాపాఠమై వర్ధిల్లి! - సిరిసిల్ల రాజేశ్వరి జీవితకథ
అంగవైకల్యాన్ని ఎదురించి తన కవితలతో ఎన్నో పురస్కారాలు అందుకున్న ‘సిరిసిల్ల రాజేశ్వరి’ జీవితాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశంగా చేర్చింది.
![కాళ్లతోనే కవితలల్లి... మహాపాఠమై వర్ధిల్లి! handicapped siricilla rajeshwari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9374265-1046-9374265-1604114630620.jpg)
సిరిసిల్ల రాజేశ్వరి
ఇప్పటి వరకు ఆమె కరోనా, మాజీ రాష్ట్రపతి దివంగత ప్రణబ్ ముఖర్జీ, సినీ గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, దాశరథి, నేత కార్మికులు, వరకట్న వేధింపులు, అత్యాచారాలు, ఆత్మవిశ్వాసం, స్నేహం, జీవితం తదితర సామాజిక, వర్తమాన అంశాలపై కవితలు రాసి సాహిత్యానికి వైకల్యం అడ్డురాదని నిరూపించారు.
రాజేశ్వరి సాహిత్యం, కృషిని మెచ్చిన సుద్దాల అశోక్‌తేజ.. ఆమెకు ‘సిరిసిల్ల రాజేశ్వరి’ అని పేరు పెట్టారు. ఆయన చొరవతోనే మహారాష్ట్ర ప్రభుత్వం రాజేశ్వరి జీవితచరిత్రను పాఠ్యాంశంగా చేర్చి గుర్తింపునిచ్చింది.
- ఇదీ చూడండియాంటీవైరల్ పొర మాస్కులతో కరోనాకు చెక్!