రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన పత్తిపాటి లక్ష్మమ్మ(80) అనే వృద్ధురాలు కరోనాను జయించింది. లక్ష్మమ్మ కరోనా పాజిటివ్ లక్షణాలతో గత నెల 28న సిరిసిల్ల పట్టణంలోని కొవిడ్ ఆసుపత్రిలో చేరింది. 80 సంవత్సరాల వృద్ధురాలు అయినప్పటికీ వైద్యులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపి చికిత్స అందించారు.
80 ఏళ్ల వయసులో కరోనాను జయించిన బామ్మ - rajanna siricilla district news
కరోనా.. ఈ పేరు వినగానే అందరికీ వెన్నులో వణుకు పుడుతోంది. ప్రత్యేకించి వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు భయంతో హడలెత్తిపోతున్నారు. అయితే మందులు లేని ఈ మహమ్మారిని కొందరు వృద్ధులు మనోధైర్యంతో జయిస్తున్నారు. వయస్సు మీద పడినప్పటికీ ... ప్రమాదకర వైరస్‌పై విజయం సాధిస్తూ... అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
80 ఏళ్ల వయసులో కరోనాను జయించిన బామ్మ
శుక్రవారం సాయంత్రం మరోసారి కొవిడ్ పరీక్షలు చేయగా.. నెగెటివ్ రావడం వల్ల ఇంటికి పంపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది అందించిన సేవలపై వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: గల్వాన్ లోయ యోధులకు శౌర్య పతకం!