రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి సిద్ధంగా ఉన్న వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కోనరావుపేట మండలం నాగారంలోని కొనుగోలు కేంద్రంలో వాన నీటికి ధాన్యం కొట్టుకుపోయింది.
అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం - RAIN EFFECT
అకాల వర్షంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పంటలు నేలకొరిగాయి. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం... నీటి పాలైంది.

అకాల వర్షం... కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
పలు గ్రామాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట వడగళ్లతో నేలకొరిగింది. ఆరుగాలం శ్రమించిన పంట కొనుగోలు కేంద్రాల్లో నీట మునగటం, చేతికొచ్చే దశలో నేలపాలు కావటం చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.