తెలంగాణ

telangana

ETV Bharat / state

'పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం’ - ధాన్యం కొనుగోలు కేంద్రాలు

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జడ్పీ ఛైర్ పర్సన్ అరుణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు. కేంద్రాల్లో రైతులందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

grain purchasing centers
grain purchasing centers

By

Published : Apr 22, 2021, 10:03 PM IST

తెరాస ప్రభుత్వం.. రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేసిందని జడ్పీ ఛైర్ పర్సన్ అరుణ అన్నారు. సంక్షేమ పథకాలతో.. అన్నదాతలను ధీమాగా బతికేలా చేసిందని కొనియడారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ కేంద్రంతో పాటు కొనరావుపేట మండలంలోని కొలనూర్, నిమ్మపల్లి, కనగర్తి గ్రామాలలో ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అరుణ ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందని అరుణ కొనియాడారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ మాధవి, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ హన్మండ్లు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:సరిహద్దుల్లో కనిపించని కరోనా కట్టడి చర్యలు

ABOUT THE AUTHOR

...view details