తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోండి' - ప్రైవేటు ఉపాధ్యాయులు

విద్య, ఉద్యోగ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. రాజన్నసిరిసిల్లా జిల్లా కేంద్రంలో, బీజేవైఎం నేతలు రాస్తారోకో చేపట్టారు. సుమారు గంటకు పైగా సాగిన ఆందోళన కారణంగా.. రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

govt should give minimum wage to private teachers
'ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోండి'

By

Published : Dec 29, 2020, 5:52 PM IST

తెరాస ప్రభుత్వం నిరుద్యోగులకు ఇస్తానన్న భృతిని తక్షణమే చెల్లించాలంటూ.. రాజన్నసిరిసిల్లా జిల్లా బీజేవైఎం అధ్యక్షులు రాజిరెడ్డి డిమాండ్ చేశారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. జిల్లా కేంద్రంలోని మానేరు వంతెన వద్ద నేతలతో కలసి ఆయన రాస్తారోకో చేపట్టారు.

కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు మూసివేయడంతో.. వేతనాలు లేక ప్రైవేటు ఉపాధ్యాయుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి కనీస వేతనం ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సుమారు గంటకు పైగా సాగిన ఆందోళన కారణంగా.. రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనను విరమింపజేశారు.

ఇదీ చదవండి:నిరుద్యోగులు ఉపాధి హామీ పనికి వెళ్తున్నారు: కోదండరాం

ABOUT THE AUTHOR

...view details