Government Action on Mid Manaire Residents : కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా రాజన్న సిరిసిల్ల జిల్లా, మాన్వాడ వద్ద 27.5 టీఎంసీల సామర్థ్యంతో మధ్యమానేరు ప్రాజెక్టు నిర్మించారు. దీనివల్ల బోయినపల్లి, వేములవాడ, తంగళ్లపల్లితో పాటు పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. సుమారు 10వేల 683 కుటుంబాలు జీవనాధారం కోల్పోయాయి. నిర్వాసితులకు ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సహాయంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ అది నెరవేరలేదు. దీంతో బాధితులు పలు విధాల ఆందోళనలు చేపట్టారు. అప్పుడు వీరికి మద్దతుగా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారని నిర్వాసితులు చెబుతున్నారు.
జలాశయ నిర్మాణంలో సర్వం కోల్పోయి నిర్వాసితులు సిరిసిల్ల ప్రధాన రహదారి వెంబడి ఆర్ అండ్ బీ కాలనీకి తరలివెళ్లారు. అయితే సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో, పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని గత పాలకులు హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. అర్హులైన ప్రతి కుటుంబానికి రాయితీపై పాడి గేదెలు అందిస్తామని చెప్పినా, నేటికీ ఇవ్వలేదు.
మిడ్ మానేరు బాధితుల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయం : బండి సంజయ్
"గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మిడ్ మానేరు నిర్వాహితులు ఎంతో త్యాగం చేశారు, వారి త్యాగాల పునాధులపై ఈరోజు ఈ ప్రాజెక్టు నిర్మించారు వారికి ఎంత ఇచ్చిన అన్నారు. కానీ పెండింగ్ సమస్యలు కూడా ఎవ్వరు పట్టించుకోలేదు. అనాటి ఉద్యమంలో మాతో పోరాటం చేసిన రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ చేతుల్లో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఏర్పడిన 10 రోజులకే అసెంబ్లీలో మిడ్ మానేరు విషయం ప్రస్తావించారు. ప్రతిఒక్కరికి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నాయకులకు ఛాన్స్ ఇవ్వకుండా అందరి సమస్యలు పరిష పరిష్కరించాలి."- నిర్వాసితులు