ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం ఘనంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. గర్భాలయంలోని శ్రీ లక్ష్మీ గణపతి మూల విరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నాగిరెడ్డి మండపంలో మట్టితో తయారు చేసిన వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఉత్సవ మూర్తికి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు.
వేములవాడలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం ఘనంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలో నాగిరెడ్డి మండపంలో మట్టితో తయారు చేసిన వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఉత్సవ మూర్తికి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు.
వేములవాడలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
ఆలయంలోని పరివార దేవతలకు ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. ఆలయంలో ఉదయం గణేశ్ పురాణ పారాయణం గావించారు. ఈనెల 30 వరకు ఆలయంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించనున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు.
ఇదీ చదవండి:ఈగ ఫిక్షనల్.. ఎలుక ఒరిజినల్