తెలంగాణ

telangana

ETV Bharat / state

పేద ముస్లిం కుటుంబాలకు ఉచితంగా నిత్యావసరాలు - తెలంగాణ వార్తలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పేద ముస్లిం(వితంతు కుటుంబాలకు) రంజాన్ కానుకగా నిత్యావసరాలను ఎస్పీ రాహుల్ హెగ్డే అందించారు. సిరిసిల్ల ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

necessaries to poor Muslim families, rajanna sircilla district
necessaries to poor Muslim families, rajanna sircilla district

By

Published : May 7, 2021, 7:48 PM IST

సిరిసిల్ల పట్టణంలోని సాయి నగర్ ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే హాజరయ్యారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని 100 పేద ముస్లిం కుటుంబాలకు.. పండుగకు సంబంధించిన సరుకులు (20 రకాలు), 20కిలోల బియ్యాన్ని తన చేతుల మీదుగా అందజేశారు.

సిరిసిల్ల ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ వారు పేద ముస్లిం కుటుంబాలని గుర్తించి.. వారికి నెలకు సరిపడా నిత్యావసరాలు ఇవ్వడం సంతోషంగా ఉందని ఎస్పీ అన్నారు. కరోనా కష్ట కాలంలో ఈ విధంగా తమకు తోచిన సాయం అందిస్తున్న సొసైటీ వారిని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ తెరాస అధ్యక్షులు చక్రపాణి, మజీద్ కమిటీ అధ్యక్షులు ఎస్.కె.యూసఫ్, మాజీ అధ్యక్షులు సలీమ్ సయ్యద్, జినా బాబా రఫీ, మహబూబ్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: గ్యాంగ్​స్టర్ చోటా రాజన్​కు తీవ్ర అస్వస్థత

ABOUT THE AUTHOR

...view details