రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొవిడ్ కారణంగా మరణించిన వారి దేహాన్ని తరలించడానికి నరేన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా వాహనాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డేలు పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఈ ఉచిత వాహన సర్వీసును జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డేలు జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా కరోనా వల్ల చనిపోయిన వారికి ఉచిత వాహనం అవసరం ఉంటే 8497962736, 9010222266 నంబర్లలో సంప్రదించాలని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.
సిరిసిల్ల జిల్లాలో ఉచిత కొవిడ్ వాహన సేవలు - సిరిసిల్ల జిల్లాలో ఉచిత కొవిడ్ వాహన సేవలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉచిత కొవిడ్ వాహన సేవలను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రారంభించారు. నరేన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా వాహనాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.
free covid vehicle services
ఇదీ చదవండి:సెంట్రల్ జైలులో ఖైదీలతో సీఎం ముచ్చట