తెలంగాణ

telangana

ETV Bharat / state

వేములవాడలో రౌడీషీటర్ హత్య - Former councilor murdered rowdy sheeter at vemulawada

వేములవాడలో రౌడీషీటర్ శివపై మాజీ కౌన్సిలర్ వెంకటేశం కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శివ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Former councilor attack on rowdy sheeter
ఎన్నికల్లో సపోర్టు చేయలేదని కత్తితో దాడి

By

Published : Feb 26, 2020, 1:58 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రౌడీషీటర్ శివను మాజీ కౌన్సిలర్ వెంకటేశ్ కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనలో శివకు తీవ్రగాయాలు కాగా... అతనిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శివ మృతిచెందాడు.

ఎన్నికల్లో సపోర్టు చేయలేదని కత్తితో దాడి

మున్సిపల్ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వకుండా వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకే హత్యచేసినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఘటన అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:దానం చేస్తే 25లక్షలు అన్నారు.. అందినకాడికి దోచేశారు!

ABOUT THE AUTHOR

...view details