తెలంగాణ

telangana

ETV Bharat / state

ముంపు ప్రాంతాల బాధితులకు పరిహారం చెల్లించట్లేదని ధర్నా - వేములవాడ తాజా వార్తలు

మధ్యమానేరు జలాశయంలో తమ గ్రామంలో ముంపునకు గురైనా.. పరిహారం అందించడం లేదంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని సంకెపల్లి గ్రామస్థులు ధర్నా చేపట్టారు. ఆర్డీవో శ్రీనివాసరావు విషయం తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం వల్ల ధర్నా విరమించారు. అనంతరం గ్రామంలో ముంపునకు గురయ్యే ప్రాంతాన్ని పరిశీలించారు.

ముంపు ప్రాంతాల బాధితులకు పరిహారం చెల్లించట్లేదని ధర్నా
ముంపు ప్రాంతాల బాధితులకు పరిహారం చెల్లించట్లేదని ధర్నా

By

Published : Sep 18, 2020, 8:01 PM IST

మధ్యమానేరు జలాశయంలో తమ గ్రామంలో ముంపునకు గురైనా.. పరిహారం అందించడం లేదంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని సంకెపల్లి గ్రామస్థులు ధర్నా చేపట్టారు. కరీంనగర్-సిరిసిల్ల ప్రధాన రహదారిపై శుక్రవారం బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. చాలా సంవత్సరాలుగా ముంపునకు గురయ్యే ఇళ్లకు పరిహారం అందిస్తామని ఇప్పటివరకు.. ఎవరికి పరిహారం చెల్లించలేదన్నారు.

మధ్యమానేరు బ్యాక్ వాటర్ ఇళ్లలోకి వస్తుందని.. విషసర్పాలు గ్రామంలో ప్రవేశిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో భయాందోళనలతో నివసిస్తున్నట్లుగా పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ రావాలంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించడం వల్ల పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.

ఆర్డీవో శ్రీనివాసరావు విషయం తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం వల్ల ధర్నా విరమించారు. అనంతరం గ్రామంలో ముంపునకు గురయ్యే ప్రాంతాన్ని పరిశీలించారు. రెండు మాసాల్లోపు పరిహారం అందిస్తామన్నారు. పట్టాలు రానివారికి త్వరలోనే పట్టాలను అందిస్తామన్నారు.

ఇదీ చదవండి:పోలవరం నిర్వాసితులకు 6 నెలల్లో పరిహారం చెల్లించాలి: ఎన్జీటీ

ABOUT THE AUTHOR

...view details