దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం గత ఐదురోజుల హుండీలను విప్పి డబ్బులను, కానుకలను లెక్కించారు. నగదు 97. 88 లక్షలు కాగా బంగారం 432 గ్రాములు, వెండి 5 కిలోల 750 గ్రాములను కానుకలుగా భక్తులు సమర్పించుకున్నారు.
రాజన్న హుండీ ఆదాయం లెక్కింపు.. నగదు 97 లక్షలు - రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో గత ఐదురోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. నగదు 97.88 లక్షలు రాగా.. 432 గ్రాముల బంగారాన్ని భక్తులు సమర్పించుకున్నారు.
ఐదురోజుల రాజన్న హుండీ ఆదాయం లెక్కింపు.. నగదు 97 లక్షలు
గత కొద్ది రోజులుగా మేడారం భక్తులు భారీగా తరలివస్తుండటం వల్ల రాజన్నకు ఆదాయం సమకూరుతుంది. హుండీల లెక్కింపు కోసం ఆలయ ఓపెన్ స్లాబ్‌లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేపట్టారు. భారీభద్రతను కల్పించారు. లెక్కింపులో ఆలయ ఈవో కృష్ణవేణి, అధికారులు, పలు సేవా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:మేడారానికి అప్పుడే భక్తుల తాకిడి.. ఆకట్టుకుంటున్న డ్రోన్ దృశ్యాలు