తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎల్లంపల్లి నీటి కోసం మత్స్యకారుల ధర్నా

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి వద్ద మత్స్యకారులు ఆందోళనకు దిగారు. ఎల్లంపల్లి నీటిని విడుదల చేయాలని రాస్తారోకో చేశారు. ఎల్లంపల్లి పైప్‌లైన్ మరమ్మతుల వల్ల చెరువులకు నీళ్లు అందడం లేదని.. చేపలు చచ్చిపోయే పరిస్థితి నెలకొందని మత్య్సకారులు ఆందోళన వ్యక్తం చేశారు.

fishermen-protest-for-yellampalli-water-at-rudrangi-in-rajanna-sircilla-district
ఎల్లంపల్లి నీటి కోసం మత్స్యకారుల ధర్నా

By

Published : Mar 16, 2021, 12:44 PM IST

ఎల్లంపల్లి నీటి కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి వద్ద మత్స్యకారులు రాస్తారోకో చేపట్టారు. ఎల్లంపల్లి పైప్‌లైన్ మరమ్మతులు చేపట్టి.. నీరు అందించకపోవడం వల్ల చేపలు చనిపోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.

జోగాపూర్‌ పంప్‌హౌజ్‌ ద్వారా లింగంపేట, రుద్రంగిలోని చెరువుల్లోకి నీటిని తరలించే ప్రధాన పైప్‌లైన్‌... అధిక వర్షాలకు పలుచోట్ల పగుళ్లు చూపింది. పైప్‌లైన్‌ దిగువనున్న మట్టి భూమిలోకి కూరుకుపోవటంతో నీటిని పంపింగ్‌ చేయటానికి వీలు కావడం లేదని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

అధిక ఎండలకు చందుర్తిలోని లింగంపేట, రుద్రంగి మండల కేంద్రాల్లో పలువురు రైతుల వరి పంటలు కూడా ఎండిపోయే స్థితికి నెలకొందని పేర్కొన్నారు. వెంటనే పైప్‌లైన్‌కు మరమ్మతులు చేసి చెరువుల్లోకి నీటిని విడుదల చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details