రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సుమారు నాలుగున్నర ఎకరాల సువిశాల స్థలంలో 22 కోట్ల రూపాయలతో, 100 పడకల ఆసుపత్రి ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నూతనంగా ప్రారంభించిన ఆ ఆసుపత్రి నుంచి తొలి కరోనా పేషెంట్ డిశ్చార్చ్ అవడం పట్ల మంత్రి కేటీఆర్(ktr tweet) ప్రశంసించారు.
ktr tweet: తొలి కరోనా పేషెంట్ డిశ్చార్చ్.. కేటీఆర్ ప్రశంస - కేటీఆర్ ట్వీట్ తాజా వార్తలు
కరోనా కష్టకాలంలో వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలను మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో కొత్తగా ప్రారంభించిన 100 పడకల ఆసుపత్రి నుంచి తొలి కొవిడ్ పేషెంట్ డిశ్చార్చ్ అవడం పట్ల కేటీఆర్ ట్విటర్(ktr tweet) ద్వారా అభినందించారు.
ktr tweet: తొలి కరోనా పేషెంట్ డిశ్చార్చ్.. కేటీఆర్ ప్రశంస
కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పేషెంట్లకు ధైర్యం కల్పిస్తూ… వైద్య సిబ్బంది సేవలు అందించడం గొప్ప విషయమని వారి సేవలను మంత్రి మెచ్చుకున్నారు. ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో విధులు నిర్వర్తించాలని వైద్యులకు, ఆసుపత్రి సిబ్బందికి, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు ట్విటర్లో మంత్రి కేటీఆర్(ktr tweet) అభినందించారు.
ఇదీ చూడండి:పిల్లలను కాపాడుకునేందుకు ఒక కంచెలా నిలబడాలి: సత్యవతి