తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆటోమొబైల్​ షాప్​లో అగ్ని ప్రమాదం...రూ. 5 లక్షల ఆస్తినష్టం - fire accident in siricilla district

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ఆటోమొబైల్​ షాపులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్​ సర్య్యూట్​ వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. సుమారు 5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

fire-accident-in-siricilla-district
ఆటోమొబైల్​ షాప్​లో అగ్ని ప్రమాదం...రూ. 5 లక్షల ఆస్తినష్టం

By

Published : Dec 18, 2019, 10:36 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ఓ ఆటోమొబైల్​ షాపులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి దుకాణంలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న వారు మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. కానీ అప్పటికే షాపులోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం వచ్చినట్లు బాధితుడు శంకర్​ తెలిపారు.

ఆటోమొబైల్​ షాప్​లో అగ్ని ప్రమాదం...రూ. 5 లక్షల ఆస్తినష్టం

ABOUT THE AUTHOR

...view details