తెలంగాణ

telangana

ETV Bharat / state

BJP Vs TRS: భాజపా, తెరాస నాయకుల పరస్పర దాడి.. ఎల్లారెడ్డిలో ఉద్రిక్తత - BJP Vs TRS

BJP Vs TRS: సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు తెరాస, భాజపా నాయకుల మధ్య ఘర్షణకు దారితీశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలోనే ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకోగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

BJP Vs TRS
BJP Vs TRS

By

Published : Mar 19, 2022, 5:11 AM IST

BJP Vs TRS: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిరకు చెందిన బీజేవైైఎం మండల ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి సామాజిక మాధ్యమాల్లో తెరాసకు వ్యతిరేకంగా పలు పోస్టులు పెట్టారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ... మూడ్రోజుల క్రితం తెరాస నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి రెండు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో పదిరకు చెందిన బీజేవైఎం జిల్లా కార్యదర్శి బోనాల సాయి ఇంటికి శుక్రవారం తెరాస నాయకులు వెళ్లారు. సాయి ఇంట్లో లేడని చెప్పడంతో వెనుదిరిగారు.

తెరాసపై ఫిర్యాదు...

ఆందోళనకు గురైన సాయి తల్లి... భాజపా నాయకులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తెరాస నాయకులపై ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసి తెరాస నాయకులు అక్కడికి చేరుకున్నారు. స్టేషన్‌ ఆవరణలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణ తలెత్తింది. పరస్పర దాడుల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెరాస నాయకులను బయటికి పంపించివేసి... గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

ఎల్లారెడ్డిలో ఉద్రిక్తత...

గొడవ విషయం అంతటా తెలియడంతో ఇరు పార్టీల నాయకులు భారీ సంఖ్యలో ఎల్లారెడ్డిపేటకు చేరుకున్నారు. పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకుంటూ... రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఫొటోలు, వీడియోలు తీస్తున్న భాజపా కార్యకర్తల ఫోన్లను తెరాస నాయకులు పగులగొట్టారు. స్టేషన్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా తెరాస నాయకులపై చర్యలు తీసుకోవాలని భాజపా నాయకులు డిమాండ్‌ చేశారు. తెరాస సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య నేతృత్వంలో సుమారు 200 మంది తెరాస నాయకులు తమ కార్యకర్తలపై దాడికి దిగారని భాజపా నాయకులు ఆరోపించారు. ఘటనపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు... పార్టీ నాయకులు సమాచారమిచ్చారు. జిల్లా ఎస్పీతో బండి సంజయ్‌ మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details