మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఫీల్డ్ అసిస్టెంట్లు చేస్తున్న సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతిస్తుందని ఆయన ప్రకటించారు.
8రోజు కొనసాగుతోన్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమ్మె
డిమాండ్ల సాధన కోసం ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు చేస్తున్న సమ్మె ఎనిమిదో రోజు కొనసాగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఫీల్డ్ అసిస్టెంట్లు చేస్తున్న సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతు తెలిపింది.
8రోజు కొనసాగుతోన్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమ్మె
జీవో నంబర్ 4779ని వెంటనే రద్దు చేయాలని, విధుల నుంచి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లకు వెంటనే చేర్చుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిచారు.
- ఇదీ చూడండి :కరోనా కలవరం: భారత్లో 169కి చేరిన కేసులు