రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్నారు. కొనుగోలు కేంద్రంలో తాలు సాకుతో ధాన్యంలో తరుగు తీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. టవరెక్కి నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించి అన్నదాతలకు మేలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
పెద్దలింగాపూర్లో టవరెక్కిన రైతులు - sirisilla district latest news
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి వస్తే తాలు పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దలింగాపూర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తరగు తీస్తున్నారని రైతులు టవరెక్కి నిరసన తెలిపారు.
పెద్దలింగాపూర్లో టవరెక్కిన రైతులు