రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్‌లో రైతులు ఆందోళన చేశారు. ధాన్యం కొనుగోలు చేయటం లేదంటూ వడ్లు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొనుగోలు చేయట్లేదని ధాన్యం తగలబెట్టి నిరసన - రైతుల నిరసనలు
ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేయట్లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా లక్ష్మీపూర్‌లో రైతులు నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం తగలబెట్టి ఆందోళన చేశారు.
![కొనుగోలు చేయట్లేదని ధాన్యం తగలబెట్టి నిరసన FARMERS PROTESTED IN LAXMIPUR IKP CENTER](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6909276-64-6909276-1587640469478.jpg)
కొనుగోలు చేయట్లేదని ధాన్యం తగలబెట్టి నిరసన
రైస్‌మిల్లర్లు క్వింటాలుకు నాలుగు నుంచి ఐదు కిలోల వరకు ధాన్యాన్ని కోత పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.