రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లిలో అటవీ భూములకు హక్కులు కల్పించాలని...గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. మరిమడ్ల సెక్షన్ పరిధిలోని తుమ్మలగుంటలో 40 ఏళ్ల క్రితం భూమి చదును చేసుకున్నట్లు 150 కుటుంబాలు తెలిపాయి. కష్టపడి చదును చేసుకున్న భూమిని అటవీశాఖ అధికారులు స్వాధీనపర్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Protest: అటవీ భూములకు హక్కులు కల్పించాలని ఆందోళన - Rajanna Sircilla district latest news
అటవీ భూములకు హక్కులు కల్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. 40 ఏళ్లుగా సేద్యం చేసుకుంటున్న భూమిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అటవీ భూములకు హక్కులు కల్పించాలని గ్రామస్థుల ఆందోళన
ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని అక్కడే బైఠాయించారు. తమ భూములు ఇవ్వకుంటే ఆత్మహత్యకు పాల్పడేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి భారీగా చేరుకొని ఆందోళనకారులను నిలువరించారు.
ఇదీ చదవండి:TS UNLOCK: తెలంగాణ అన్లాక్.. ఇవన్నీ ఓపెన్
TAGGED:
తెలంగాణ తాజా వార్తలు