DRONE SURVEY: కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల మూడో టీఎంసీ కాలువ భూసేకరణ రోజురోజుకు మరింత జఠిలమవుతోంది. భూనిర్వాసితులు ససేమిరా అంటున్న అధికారులు మాత్రం ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ వద్ద డ్రోన్ కెమెరాలతో అధికారులు సర్వే చేపట్టారు. విషయంపై తెలుసుకున్న నిర్వాసితులు పొలం వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. మందు డబ్బాలు చేతపట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు.
DRONE SURVEY: డ్రోన్‌తో భూసర్వేకు అధికారుల యత్నం.. అడ్డుకున్న నిర్వాసితులు - Farmers opposed drone survey
DRONE SURVEY: కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల మూడో టీఎంసీ కాలువ భూసేకరణ ఉద్రిక్తంగా మారింది. డ్రోన్ కెమెరాలతో అధికారులు భూ సర్వేకు యత్నించగా నిర్వాసితులు అడ్డుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ వద్ద మందు డబ్బాలు చేత పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
విలాసాగర్లో గత 25 రోజులుగా భునిర్వాసితులు ఆందోళన చేస్తుండటంతో అధికారులు డ్రోన్ కెమెరాలను వినియోగించి సర్వేకు యత్నించారు. సమాచారం తెలుసుకున్న భూనిర్వాసితులు అధికారుల ముందే నిరసనకు దిగారు. దీంతో అధికారులకు, రైతులకు తీవ్రమైన వాగ్వాదం జరిగింది. అధికారులు ఎంత సర్దిచెప్పిన కూడా సర్వేకు చేసేందుకు ఒప్పుకోలేదు. దీంతో చేసేదేమిలేక అధికారులు గ్రామసభ నిర్వహిస్తామని ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇదీ చూడండి:మార్కెట్ ధర ఇస్తేనే భూములిస్తం.. కాళేశ్వరం మూడో టీఎంసీ నిర్వాసితులు