తెలంగాణ

telangana

ETV Bharat / state

అకాల వర్షంతో నేలపాలైన పంట పొలాలు - అకాల వర్షంతో నేలపాలైన పంట పొలాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి ధాన్యం కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యమంతా తడిసిపోయింది.

VEMULAVADA FARMERS PROBLEMS
అకాల వర్షంతో నేలపాలైన పంట పొలాలు

By

Published : Apr 28, 2020, 9:10 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగి, చందుర్తి, కోనారావుపేట, వేములవాడ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి సిద్ధంగా ఉన్న వరి ధాన్యమంతా తడిసి ముద్దపోయింది. బలంగా వీచిన ఈదురు గాలులకు చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లోని మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి.

కోతకు సిద్ధంగా ఉన్న పొలాల్లో వరి ధాన్యం నేలపాలైంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లెదుటే నీటిపాలు కావడం వల్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చూడండి:ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details