తెలంగాణ

telangana

ETV Bharat / state

పంటకు నిప్పు పెట్టి నిరసన తెలిపిన రైతు - etv bharat

సన్నరకం వేయమని చెప్పడంతోనే పంటను సాగు చేసి తీవ్రంగా నష్టపోయామని ఓ రైతు తన కుటుంబ సభ్యులతో సహా నిరసన తెలిపిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ప్రతి ఏటా దొడ్డు రకం వరి సాగు చేసే వాడినని కాని ఈ ఏడాది ప్రభుత్వం సన్నరకం సాగు చేయమని చెప్పిందన్నారు.

farmer protest in rajanna sirisilla district
సన్నరకం వేసి నష్టపోయానని రైతు నిరసన

By

Published : Oct 23, 2020, 2:33 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన దేవరాజు అనే రైతు తనకున్న రెండెకరాలలో తెలంగాణ సోనా వరి పంటను సాగు చేశారు. ప్రతి ఏటా దొడ్డు రకం వరి పంటలు సాగు చేసే వాడినని.. ప్రభుత్వం సన్నరకం వరి పంట సాగు చేయాలని చెప్పడం వల్ల తెలంగాణ సోనా పంటను సాగు చేశానని తెలిపారు.

ఈ పంటకు తెగులు సోకి పూర్తిగా నష్టపోయానని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు తెగులు సోకిందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా రాకపోవడం వల్ల ఏ మందులు కొట్టాలో తెలియక రూ. 80 వేల వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయానని ఆవేదనతో దేవరాజ్ పంటకు నిప్పుబెట్టి నిరసన తెలిపారు.

ఇదీ చదవండి:రాష్ట్ర ఖజానా కళకళ.. పుంజుకుంటోన్న ఆర్థిక వ్యవస్థ

ABOUT THE AUTHOR

...view details