లాక్డౌన్ వల్ల పశువులు ఆకలితో అలమటించకుండా దాతలు సాయం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని కోడెలకు కరీంనగర్ జిల్లా రామడుగు రైతులు పశుగ్రాసాన్ని పంపించారు.
రాజన్న కోడెలకు రామడుగు నుంచి పశుగ్రాసం - Sri Raja Rajeshwara temple calves
కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి చెందిన రైతులు తమ వద్ద నిల్వ ఉన్న పశుగ్రాసాన్ని శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని కోడెల కోసం పంపుతున్నారు.
రాజన్న కోడెలకు రామడుగు నుంచి పశుగ్రాసం
యంత్రాలతో వరికోతలు పూర్తైనందున గ్రామాల్లోని రైతులంతా కలిసి నిర్ణయం తీసుకుని ట్రాక్టర్లతో పశుగ్రాసాన్ని తరలిస్తున్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలోని పందికుంటపల్లి సర్పంచ్ కట్కం రవీందర్ ఆధ్వర్యంలో గ్రామంలోని యువకులు ట్రాక్టర్లలో పశుగ్రాసాన్ని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి పంపించారు.