రాజన్నసిరిసిల్ల జిల్లాలో నిర్మించిన మధ్యమానేరు ప్రాజెక్టు ఆనకట్టలో చౌడునేల ఉన్న భాగాన్ని తొలగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపించిందని ఆరోపణలు వెలువెత్తిన తరుణంలో ప్రభుత్వం మట్టికట్ట నాణ్యతను పరిశీలించింది. మట్టి కట్టలోని 2,475 మీటర్ల నుంచి 2,675 మీటర్ల వరకు గల మట్టి కట్టలో చౌడు మట్టి ఉన్నట్లు తేలింది. ఆ ప్రాంతంలో మట్టి కట్టను లోతుగా పరిశీలించాలని డ్యాం సేఫ్టీ బృందం నిర్ణయించినట్లు సమాచారం. నీలోజుపల్లి నుంచి కొత్తపేట వెళ్లే శివారులోని బోగం ఒర్రె వద్ద పునాదులు సరైన రీతిలో నిర్మించలేదన్న ఆరోపణలు వెలువెత్తాయి. ఈ క్రమంలో దాదాపు 200 మీటర్ల వరకు మట్టికట్టను ప్రోక్లెయిన్లతో తవ్వుతున్నారు. సుమారు 5 మీటర్ల మేర కట్టను తవ్వుతున్నట్లు సమాచారం.
లీకేజీ కాదు సీపేజీ...