తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్​ ఎప్పుడూ ముందుంటుంది' - ప్రభుత్వ బిల్లులపై వ్యతిరేకంగా సంతకాల సేకరణ సిరిసిల్ల

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ రాజన్న సిరిసిల్లలో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రారంభించారు. ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.

'ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్​ ఎప్పుడూ ముందుంటుంది'
'ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్​ ఎప్పుడూ ముందుంటుంది'

By

Published : Oct 2, 2020, 7:09 PM IST

ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని స్థానిక గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ, కిసాన్ మజ్దూర్ బచావ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పొన్నాల లక్ష్మయ్య హాజరై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరే విధంగా ఉందని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఈ బిల్లు ద్వారా రైతులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఇష్టానుసారంగా జీవోలను అమలు చేస్తూ, పేద ప్రజలపై పెనుభారం మోపే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి రైతు వద్దకు వెళ్లి వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టి ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రపతికి ప్రజల నాడి వినిపించేలా కృషి చేయాలన్నారు.

ఇదీ చదవండి:'కర్షకుల కష్టాన్ని కార్పొరేట్లకు కట్టబెడితే ఊరుకోం'

ABOUT THE AUTHOR

...view details