తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉపాధి హామీ కూలీల ధర్నా.. శ్రమదోపిడీపై ఆందోళన - Dharna of employment guarantee workers in Rajanna Sirisilla district

వేసవి కాలంలో ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాల్సిన మినహాయింపులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆందోళన చేపట్టారు. నలుగురుతో తవ్వించే క్యూబైక్ మీటర్ గుంతను ముగ్గురితో తవ్విస్తున్నారని... రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో నిరసన వ్యక్తం చేశారు.

Employment Guarantee Workers' Dharna
ఉపాధి హామీ కూలీల ధర్నా

By

Published : Apr 15, 2021, 3:04 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఉపాధి హామీ కూలీలు ఆందోళన చేపట్టారు. వేసవి కాలంలో ఇవ్వాల్సిన మినహాయింపులను నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోయారు. క్యూబైక్ మీటర్ గుంతను తవ్వడానికి వర్షాకాలం నుంచి చలికాలం ముగిసే వరకు ముగ్గురు కూలీలు తవ్వాలని... వేసవిలో అదే గుంతను నలుగురు కూలీలు తవ్వాలని ఉన్న నిబంధనలను పాటించటంలేదని నిరసన వ్యక్తం చేశారు.

వేసవికాలంలో భూమి గట్టిపడటంతో తమ చేతులకు పొక్కులు వస్తున్నాయని వేములవాడ కోరుట్ల రహదారిపై సుమారు గంటపాటు ధర్నా కొనసాగించారు. గతంలో క్యూబిక్ మీటర్​కు రూ. 301 చెల్లిస్తే... ఇప్పుడు రూ. 252కు తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముదురుతున్న ఎండలకు క్షేత్ర స్థాయిలో ఉపాధి కూలీలు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకుని న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు.

ఇదీ చదవండి:ఖాళీలు భర్తీ చేసేదాక కేసీఆర్‌ను వదలబోం: వైఎస్ షర్మిల

ABOUT THE AUTHOR

...view details