తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త వైరస్​ ప్రమాదకరం కాదు : మురళీధర్ రావు - కొత్త వైరస్​ ప్రమాదకరం కాదన్న మురళీధర్​రావు

చలికాలంలో చిన్నపిల్లలకు దగ్గు, జలుబు వస్తే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటిండెంట్​ మురళీధర్ రావు అన్నారు. మూడు రోజులపాటు పరిస్థితి అలాగే ఉంటేనే వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Don't worry about coughs and colds in winter season by doctor Muralidhar Rao
కొత్త వైరస్​ ప్రమాదకరం కాదు : మురళీధర్ రావు

By

Published : Dec 24, 2020, 4:12 PM IST

విదేశాల్లో కొత్తగా అలజడి సృష్టిస్తున్న కరోనా వైరస్​ అంత ప్రమాదకరమైనదేమి కాదని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటిండెంట్​ మురళీధర్ రావు వెల్లడించారు. మన దగ్గర వైరస్​ ఎలాంటి ప్రభావం చూపదని.. ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

చలికాలంలో చిన్నపిల్లలకు దగ్గు, జలుబు వస్తే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. మూడు రోజులపాటు పరిస్థితి అలాగే ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకొని తగిన మందులు వాడాలని సూచించారు. చిన్నపిల్లలకు సంబంధించిన కరోనా పరీక్షలు, మందులు అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:ఈటల అధ్యక్షతన నిపుణుల కమిటీ అత్యవసర భేటీ

ABOUT THE AUTHOR

...view details