వానరం జాతి వైరాన్ని మరిచి కుక్క పిల్లకు పాలిచ్చి అమ్మ ప్రేమను పంచింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండలోకి ఓ కోతి... ఇంకా కళ్లు కూడా తెరవని కుక్కపిల్లను ఎత్తుకు వచ్చింది. పసికూనను పట్టుకుని చెంగు చెంగున గోడలపై నుంచి దూకుతుంటే స్థానికులు అవాక్కయ్యారు.
కుక్కపిల్లకు అన్నీ తానై.. వానరం సపర్యలు - telangana news
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ కోతి కుక్కపిల్లని ఎత్తుకుని తిరుగుతుండటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాన్ని చేతుల్లో పట్టుకుని.. గుండెకు హత్తుకుని బిడ్డలా చూసుకుంటోంది. జాతి వైరాన్ని మరిచి కుక్కపిల్ల పట్ల అమితమైన ప్రేమను చూపిస్తూ అక్కున చేర్చుకుంటోంది. ఈ ఆసక్తికరమైన దృశ్యాలు ప్రస్తుతం వివిధ సామాజిక గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి.
కుక్కపిల్లకు పాలిచ్చిన కోతి
కుక్కపిల్ల ఎక్కడ కింద పడిపోతుందోనని కంగారు పడి కేకలు వేశారు. ఈ రెండింటినీ విడదీసేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కోతి మాత్రం ఏమాత్రం భయపడకుండా తన గుండెలకు హత్తుకుని పరుగెత్తడమే కాకుండా పాలిచ్చి ఆకలిని సైతం తీర్చింది. జాతి వైరాన్ని విస్మరించి కుక్కపిల్లపై వానరం చూపే తల్లిప్రేమ చూడముచ్చటగా ఉందని స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి:మంచి ఆరోగ్యానికి మేలిమి అలవాట్లు