తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో తొలి డిజిటల్​ గ్రామంగా 'జిల్లెల్ల' - DIGITAL_VILLAGE_JILLELLA

రాష్ట్రంలోనే తొలి డిజిటల్ గ్రామంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జిల్లెల్ల రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఈ-పంచాయతీ, హెల్త్​సెంటర్​, ప్రభుత్వ పాఠశాలలో పలు సౌకర్యాలను త్వరలోనే వీటిని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అధికారికంగా ప్రారంభించనున్నారు.

DIGITAL_VILLAGE_JILLELLA

By

Published : Sep 3, 2019, 11:19 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లను పైలట్ ప్రాజెక్టు కింద డిజిటల్ గ్రామంగా తయారు చేస్తున్నారు. అందులో భాగంగా గ్రామపంచాయతీ, ప్రభుత్వ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డిజిటలైజేషన్ కోసం కావాల్సిన పరికరాలను కంటైనర్​లలో మూడు క్యాబిన్​లను ఏర్పాటు చేశారు. హెల్త్ సెంటర్ క్యాబిన్లో ఈసీజీ, బీపీ, షుగర్ ఇతర వైద్య పరీక్షలకు సంబంధించిన సామాగ్రి ఏర్పాటు చేశారు. ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి ఆన్​లైన్ సేవలు అందిస్తున్నారు. ఈ-పంచాయతీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి గ్రామస్థులకు ధ్రువపత్రాలతో పాటు, ఇంటి నిర్మాణ అనుమతులు, జనన, మరణ ధ్రువపత్రాలు, మ్యారేజ్ సర్టిఫికెట్స్, లేఅవుట్ అనుమతుల లాంటి అన్ని రకాల సేవలు అందిస్తున్నారు. తమ గ్రామంలో అమలు చేస్తున్న సేవల పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో తొలి డిజిటల్​ గ్రామంగా 'జిల్లెల్ల'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details