"ధరణి" ఆకలి తీరుస్తోంది.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏ కార్యక్రమంలోనైనా ఆహార పదార్థాలు మిగిలితే వృథా చేయకుండా తనకు సమాచారం అదించాలంటూ... ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఓ సాదాసీదా అంగన్వాడీ ఉద్యోగిని వింద్యారాణి. ఆహరం మిగిలిపోయిందని ఒక్కఫోన్ చేస్తే చాలు నిమిషాల్లో వచ్చేస్తారు ఆ సంస్థ సభ్యులు. ఇందుకోసం ధరణి పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సొంతంగా ఆటోను, వంట సామాగ్రిని ఏర్పాటుచేసుకున్నారు. ఈ పదార్థాలను తీసికెళ్లి సిరిసిల్లలోని కార్మికవాడల్లో పేదలకు పంచుతూ ఆకలి తీరుస్తున్నారు.
ఇద్దరితో మొదలై2004 లో ధరణి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసినప్పుడు రాణితోపాటు ఆమె భర్త మాత్రమే సభ్యులు. ఇప్పుడు సుమారు 50 మందికి పైగా సభ్యులున్నారు. ఆహారం అదించడమే కాకుండా విద్యార్థులకు ఆర్థికసాయం, వివాహాలకు చేయూతనిస్తున్నారు. వింద్యారాణి సేవలను గుర్తించిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షులు కె.తారకరామారావు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా 2018లో రూ. 51వేల నగదు బహుమతి అందించారు.
సొంతవాళ్లే పట్టించుకోని రోజుల్లో ఇతరుల ఆకలిని గుర్తించి వారికి సాయం చేస్తున్న వింద్యారాణిని అందరూ అభినందిస్తున్నారు.