వేములవాడ రాజన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఉదయం ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమశంకర శర్మ ఆధ్వర్యంలో అర్చకులు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి... భక్తుల దర్శనం కల్పించారు. భక్తులు ధర్మ గుండంలో స్నానం ఆచరించి ప్రధాన కోడె మొక్కు చెల్లించి స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుండటం వల్ల ఈరోజు, రేపు ఆర్జిత సేవలు రద్దు చేశారు. భక్తులకు లఘు దర్శనభాగ్యం కల్పించారు.
రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు - Devotes
శ్రావణమాసం... వరుసగా సెలవులు రావటం వల్ల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో నిండిపోయింది. భక్తులు స్వామివారిని దర్శించుకొని గండ దీపంలో నూనె పోసి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు