తెలంగాణ

telangana

ETV Bharat / state

భక్తుల ఇక్కట్లు - శివరాత్రి ఉత్సవాలు

శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. వేములవాడ రాజన్న ఆలయంలో ఉదయం నుంచే భక్తులు దర్శనానికి బారులు తీరారు. క్యూలైన్లలో సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు.

శివరాత్రి

By

Published : Mar 4, 2019, 1:56 PM IST

రాజన్న దర్శనానికి భక్తుల ఇబ్బందులు
వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తులు ఇక్కట్లకు గురవుతున్నారు. రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోలేక చిన్నపిల్లలు, వృద్ధులు అవస్థలు పడ్డారు. సమాచారం అందించేవారు లేక.. దర్శనం సమయంలో భక్తులు అయోమయానికి గురయ్యారు.

వీఐపీలకే ముందు

స్వామివారి దర్శనానికి వీఐపీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రముఖులు అధికంగా రావడం వల్ల సర్వదర్శనం నిలిపివేశారు. ఇది భక్తులను ఆగ్రహానికి గురి చేసింది.

కనీస సౌకర్యాలు లేవు

క్యూలైన్లలో కనీసం తాగునీటి సౌకర్యం కల్పించలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు, బట్టలు మార్చుకునే గదులు సరిపడా లేక ఇబ్బందులు పడ్డామని వాపోతున్నారు. చిన్న పిల్లలతో ఇబ్బందులు పడుతున్నామని ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని స్వామి దర్శనం త్వరగా అయ్యేలా చూడాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి:సర్వం శివమయం

ABOUT THE AUTHOR

...view details