తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం - telangana varthalu

వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ కోడె మొక్కులు చెల్లించుకున్నారు.`

రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం
రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం

By

Published : Feb 16, 2021, 3:29 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి మంగళవారం భక్తుల తాకిడి పెరిగింది. బద్ది పోచమ్మ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బోనాలతో మొక్కులు చెల్లించుకునేందుకు బారులు తీరారు.

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: వర్గల్ సరస్వతి క్షేత్రంలో వసంత పంచమి

ABOUT THE AUTHOR

...view details