రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు లైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్నందున అధికారులు ఆర్జిత సేవలను రద్దుచేసి శీఘ్ర దర్శనాలను అమలుపరిచారు. దర్శనాల అనంతరం భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు - devotees rush at vemulwada rajanna temple
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అధికారులు ఆర్జిత సేవలు రద్దు చేసి శీఘ్ర దర్శనాలు అమలుపరిచారు.
![వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు devotees rush at vemulwada rajanna temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5464474-thumbnail-3x2-vemulwada.jpg)
రాజన్న ఆలయానికి తరలివచ్చిన భక్తులు