తెలంగాణ

telangana

ETV Bharat / state

Vemulavada Devotees: శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు - రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో బారులు తీరారు. సుమారు 50 వేలకు పైగా భక్తులు రాజన్నను దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

VEMULAWADA
VEMULAWADA

By

Published : Oct 18, 2021, 3:55 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి. సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారింది. ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకునేందుకు బారులు తీరారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారు 50 వేలకు పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

భక్తులతో సందడిగా మారిన శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం

ఘనంగా సాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు...

సిరిసిల్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో పద్మావతి అమ్మవారికి ఒడి బియ్యం, పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ తన చేనేత మగ్గంపై నేసిన స్వామివారి మూడు నామాల పట్టు వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ సంఘం నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:yadadri: యాదాద్రి శిల్పకళా వైభవం.. చూసి తరించండి

ABOUT THE AUTHOR

...view details