తెలంగాణ

telangana

ETV Bharat / state

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు - Rajanna Sirisilla District Latest News

శివుడికి సోమవారం అత్యంత ప్రీతి పాత్రమైన రోజు కావడంతో.. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో దేవాస్థాన పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Devotees flocked to the Vemulawada Sri Rajarajeswara swamy Temple on Monday
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

By

Published : Feb 22, 2021, 12:13 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో దేవస్థానం కిక్కిరిసింది. స్వామివారి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తజనులు క్యూలైన్లలో పెద్ద ఎత్తున బారులు తీరారు.

దర్శనానికి మూడు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామివారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 35 వేల మంది దర్శించుకోనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:ఘనంగా ప్రారంభమైన లక్ష్మీగణపతి దశమ వార్షికోత్సవం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details