రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో సోమవారం నాడు భక్తుల సందడి పెరిగింది. స్యామి వారి దర్శనం కోసం భారీగా వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మరాయి.
రాజన్న సన్నిధిలో బారులు తీరిన భక్తులు - కోడె మొక్కులు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైన రోజు కావడంతో.. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
రాజన్న సన్నిధిలో బారులు తీరిన భక్తులు
భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కోడె మొక్కులు చెల్లించుకొంటున్నారు. భక్తి పారవశ్యంతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉదయం నుంచి ఇప్పటివరకూ సుమారు లక్ష మంది స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి :భక్తి పారవశ్యం... యాదాద్రిలో జన సందోహం