ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో దర్శనం కోసం భక్తులు సోమవారం పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు.. తెల్లవారుజాము నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా గర్భాలయంలో సేవలు రద్దు చేసి.. భక్తులకు శీఘ్ర దర్శనం కల్పిస్తున్నారు.
వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు - తెలంగాణ వార్తలు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసర ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. కరోనా దృష్ట్యా గర్భాలయంలో సేవలు రద్దు చేశారు.
వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
భక్తులు గర్భాలయంలో స్వామి వారి దర్శించుకుని.. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసర ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. కళాభవన్లో జరిగిన సత్యనారాయణస్వామి వ్రతాలు, స్వామి వారి కల్యాణంలో భక్తులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:వ్యాపారాలు చేస్తూ... భర్తలకు చేదోడు వాదోడుగా ఉంటూ..