తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన - సిరిసిల్లలో కాగడాల ప్రదర్శన

రాజన్నసిరిసిల్లలో భాజపా నాయకులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2023లో భాజపా అధికారంలోకి వచ్చాక... ప్రభుత్వం తరఫున వేడుకలు జరుపుతామన్నారు.

demonstration of crows in rajanna siricilla by bjp
భాజపా ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన

By

Published : Sep 15, 2020, 10:57 PM IST

సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ... రాజన్న సిరిసిల్లలోని పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భాజపా నాయకులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ వస్తే సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఇప్పుడు నిర్వహించకపోవడంలో ఆంతర్యమేంటని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి ప్రశ్నించారు. 2023లో జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు .

ఇదీ చూడండి:'అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చారు'

ABOUT THE AUTHOR

...view details