ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఈనెల 22వరకు దర్శనాలను నిలిపివేశారు. కరోనా విజృంభణ కొనసాగుతుండటంతో ఆలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు . ఆలయ ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని అనుమతించక పోవడంతో పూర్తిగా నిర్మానుష్యంగా మారింది.
వేములవాడ రాజన్న ఆలయం నిర్మానుష్యం - raja rajeshwara temple latest updates
కొవిడ్ నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఈనెల 22వరకు దర్శనాలను నిలిపివేశారు. ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని అనుమతించక పోవడంతో దేవాలయ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి.
రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు బద్దిపోచమ్మ, భీమేశ్వరాలయం, నాంపల్లి లక్ష్మి నర్సింహస్వామి ఆలయం, మామిడిపల్లి ఆలయంలోనూ దర్శనాలు నిలిపివేశారు. ఈనెల 21న శ్రీరామనవమి రథోత్సవంతో పాటు కల్యాణాన్ని రద్దు చేసి భక్తులు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దీనితో ఆలయ ప్రాంగణాలు వెలవెలబోతున్నాయి. కరోనా రెండో దశ వైరస్ వేగంగా విసరిస్తున్న దృష్ట్యా ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని ఆలయ అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఇదీ చదవండి:తెలంగాణలో 5వేలు దాటిన కరోనా కేసులు