రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఆరెపల్లిలో కరోనా బెంబేలిత్తిస్తుండగా.. అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ఇటీవలే కొవిడ్ పరీక్షల్లో 30 మందికి పాజిటివ్‌గా తేలింది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టిన స్థానికులు కరోనా వ్యాప్తిని అరికట్టేలా చూస్తున్నారు.
కరోనా కట్టడికి పల్లెవాసుల శ్రమ.. భౌతికదూరం పాటించేలా చర్యలు
కరోనా కట్టడికి పల్లెవాసులు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కొన్ని గ్రామాలు సెల్ఫ్‌లాక్‌డౌన్ విధించుకుంటున్నాయి. మరికొన్నిచోట్ల జనం గుమిగూడకుండా చూస్తున్నారు. చాటింపులు వేయిస్తూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.
కరోనా కట్టడికి చర్యలు, వేములవాడలో కరోనా కట్టడి, వేములవాడ కరోనా న్యూస్
అందులో భాగంగా గ్రామ కూడలిలోని సిమెంట్ బెంచీల్లో జనం కూర్చోకుండా తలకిందులుగా పడేశారు. గ్రామస్థులుగానీ, వేరే ఊళ్లవాళ్లు ఎవరూ ఒకచోట గుమిగూడకుండా ఆలోచించి ఇలా బెంచీలను తలకిందులు చేశారు.
- ఇదీ చదవండి :'వైరస్ బాధితుల రాక ఇదే విధంగా కొనసాగితే కష్టమే'