రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మరో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుమన్ మోహన్ రావు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 46 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు చేరుకున్న వారిని గృహ నిర్బంధం చేశారు.
వేములవాడ పట్టణంలో నలుగురికి కరోనా పాజిటివ్ - covid-19 latest news
కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. ఓ వృద్ధుడు మృతి చెందగా.. కరోనాతోనే మృతి చెందాడనే వదంతులు వ్యాపించాయి.
వేములవాడ పట్టణంలో నలుగురికి కరోనా పాజిటివ్
జిల్లా నుంచి 25 నమూనాలు పంపించగా.. ఆరు పాజిటివ్ కేసులు శుక్రవారం రాత్రి నిర్ధారణ అయ్యాయి. వేములవాడ పట్టణంలోనే నలుగురికి సోకినట్లు అధికారులు తెలిపారు. పట్టణంలో ఓ వృద్ధుడు అనుమానాస్పదంగా మృతి చెందగా.. కరోనాతోనే చనిపోయాడని వదంతులు వ్యాపించాయి.
ఇవీ చూడండి: కరోనాపై ఇంటి నుంచే యుద్ధం.. హోం ఐసోలేషన్‌లోనే వైద్య సేవలు..