తెలంగాణ

telangana

ETV Bharat / state

సిరిసిల్ల జిల్లాలో సెస్‌ ఎన్నికల పోలింగ్ ప్రారంభం - Sircilla Cess Election today

CESS Elections Today: రాజన్నసిరిసిల్ల జిల్లాలో సెస్‌ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 15 డైరెక్టర్ స్థానాలకు, 75 మంది అభ్యర్థులు పోటీల్లో ఉన్నారు. ఇందుకోసం 202 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.

CESS Elections
CESS Elections

By

Published : Dec 24, 2022, 10:34 AM IST

CESS Elections Today: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహకార విద్యుత్‌ సరఫరా సంఘం ఎన్నికలు.. బ్యాలెట్ పద్ధతిలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. జిల్లాలో 13 మండలాల్లో 15 డైరెక్టర్‌ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. సిరిసిల్ల సెస్‌ పరిధిలో మీటర్లు కలిగిన వారు ఓటు వేయనున్నారు. జిల్లాలో మొత్తం 87,130 ఓటర్లు ఉండగా.. 75 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 202 పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో 252 పోలింగ్‌ బూతులు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి 750 ఎన్నికల సిబ్బంది, 15 మంది రూట్‌ ఆఫీసర్లు , 1100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్‌ ప్రక్రియ జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details