రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిస్సహాయ స్థితిలో ఉన్న 80 సంవత్సరాల వృద్ధురాలికి కానిస్టేబుల్ (constable) రాజశేఖర్ అండగా నిలిచారు. పింఛను డబ్బుల కోసం వచ్చిన వృద్ధురాలు పాత బస్టాండ్ సమీపంలో నడవలేని పరిస్థితుల్లో ఉండటం గమనించారు. వాకర్ సహాయంతో ఉదయం వచ్చిన వృద్ధురాలు ఇంటికి వెళ్లలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది.
Constable Help: వృద్ధురాలికి అండగా నిలిచిన కానిస్టేబుల్ - వృద్ధురాలికి కానిస్టేబుల్ అండ
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఓ వృద్ధురాలికి విధుల్లో కానిస్టేబుల్ అండగా నిలిచారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలికి మానవత్వంతో స్పందించి ఆమె గమ్యస్థానానికి చేర్చారు.
constable
లాక్ డౌన్ విధులను నిర్వహిస్తున్న ఎల్లారెడ్డిపేట కానిస్టేబుల్ రాజశేఖర్… వృద్ధురాలు ఎండలో ఓ చెట్టు కింద కూర్చొని ఉండడం గమనించారు. ఆహారం, మంచినీళ్లు అందించి వివరాలు అడిగి తెలుసుకొని ఆటో మాట్లాడి ఇంటికి పంపించారు. కానిస్టేబుల్ రాజశేఖర్ ను పలువురు అభినందించారు.