తెలంగాణ

telangana

ETV Bharat / state

TRS VS BJP: సిరిసిల్లలో తెరాస, భాజపా నాయకుల మధ్య బాహాబాహీ - తెలంగాణ వార్తలు

సిరిసిల్ల పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భాజపా(BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఎమ్మెల్యే మైనంపల్లి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో తెరాస, భాజపా వర్గీయుల పరస్పరం దాడులు చేసుకున్నారు.

TRS VS BJP, bjp protest
సిరిసిల్లలో తెరాస, భాజపా నాయకుల మధ్య వాగ్వాదం, సిరిసిల్లలో ఉద్రిక్తత

By

Published : Aug 16, 2021, 2:45 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద తెరాస(TRS), భాజపా(BJP) నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై(BANDI SANJAY) ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యల పట్ల భాజపా శ్రేణులు నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో తెరాస, భాజపా నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. క్రమంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సిరిసిల్లలో ఉద్రిక్తత

ఈ సంఘటనలో ఇరు పార్టీల నాయకులు పరస్పర దాడులు చేసుకున్నారు. భాజపా నాయకులు తెరాస పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు... వారిని చెదరగొట్టారు. నిరసనకు దిగిన భాజపా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:FIGHT: తెరాస, భాజపా నేతల ఫైట్​.. బండి సంజయ్ ఫైర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details